Viral News: అతని వయసు 75.. ఆమెకు 70.. పెళ్లైన 54 ఏళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధ జంట..!

ABN , First Publish Date - 2022-08-09T18:57:11+05:30 IST

అతని వయసు 75 సంవత్సరాలు.. అతని భార్య వయసు 70 ఏళ్లు.. వారికి 54 ఏళ్ల కిందట వివాహం అయింది..

Viral News: అతని వయసు 75.. ఆమెకు 70.. పెళ్లైన 54 ఏళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధ జంట..!

అతని వయసు 75 సంవత్సరాలు.. అతని భార్య వయసు 70 ఏళ్లు.. వారికి 54 ఏళ్ల కిందట వివాహం అయింది.. అయితే వారికి ఎంతకీ పిల్లలు పుట్టలేదు.. ఇక, పుట్టరని కూడా ఫిక్స్ అయిపోయారు.. అయితే లేటు వయసులో వారి కల ఫలించింది.. ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ (In Vitro Fertilization) ద్వారా ఆ దంపతులు తల్లిదండ్రులయ్యారు.. 70 ఏళ్ల ఆ వృద్ధురాలు (Old woman gave birth to child) తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ వయసులో తల్లిదండ్రులయ్యారని, రాజస్థాన్‌లో అయితే ఇదే మొదటి కేసు అని డాక్టర్ తెలిపారు. 


ఇది కూడా చదవండి..

6 thousand crores: తన అకౌంట్ చెక్ చేసుకున్న బీహార్ వ్యక్తికి షాక్.. ఏకంగా రూ.6 వేల కోట్లు..


రాజస్థాన్‌ (Rajastan)లోని జుంజునులోని నుహానియా గ్రామానికి చెందిన గోపీచంద్ భారత ఆర్మీలో పనిచేశాడు. బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొని గాయపడ్డాడు. 54 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న గోపీచంద్‌కు పిల్లలు లేరు. పిల్లల కోసం గోపీచంద్, అతని భార్య చంద్రావతి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. అయినా ఫలితం కనిపించలేదు. చివరకు IVF వైద్యుడు పంకజ్ గుప్తాను ఆశ్రయించి చికిత్స తీసుకున్నారు. దీంతో వారి కల ఫలించింది. 70 ఏళ్ల వయసులో గోపీచంద్ భార్య సోమవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో గోపీచంద్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 


`ఇప్పుడు మేం కూడా మిగిలిన వారితో సమానం అయ్యాం. మా వంశం కూడా ముందుకు సాగుతుంది. ఆనందంతో మాటలు రావడం లేదు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశామ`ని గోపీచంద్ అన్నాడు. IVF నిపుణుడు డాక్టర్ పంకజ్ గుప్తా మాట్లాడుతూ.. `ఈ వయస్సులో పిల్లలు పుట్టిన సందర్భాలు దేశవ్యాప్తంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. బహుశా రాజస్థాన్‌లో ఇదే మొదటి కేసు. చిన్నారి బరువు దాదాపు మూడున్నర కిలోలు ఉంద`ని అన్నారు. 

Updated Date - 2022-08-09T18:57:11+05:30 IST