ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లొస్తామని తల్లికి చెప్పి.. ఆ అక్కాచెల్లెలు చేసిన పనేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-11T17:51:24+05:30 IST

వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి..

ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లొస్తామని తల్లికి చెప్పి.. ఆ అక్కాచెల్లెలు చేసిన పనేంటో తెలిస్తే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అత్తారింటికి వెళ్లడం ఇష్టంలేక పుట్టింట్లోనే ఉంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లి తినొస్తామంటే.. తల్లి డబ్బులిచ్చింది. కానీ ఆ అక్కాచెల్లెలు చేసిని పనికి తల్లితోపాటు కుటుంబసభ్యులు కంగుతిన్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 


జిల్లాలోని బేవార్ ప్రాంతానికి చెందిన చోటు గుర్జార్ అనే వ్యక్తికి మొత్తం ఏడు మంది పిల్లలు. అందులో ఐదుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. మిగతా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. మూడో కూతురు అంజూకు 11నెలల క్రితం బేవార్ పట్టణం శివనాథ్‌పుర ప్రాంతానికి చెందిన రాకేష్ గుర్జార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. దురదుష్టవశాత్తు ఆమె గర్భం పోయింది. అప్పటినుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. అత్తారింటివాళ్లు ఇంటికి రా అని పిలిచిన ఆమె వెళ్లడంలేదు. నాల్గో కూతురు నిషాకు కూడా బేవార్ పట్టణం పీప్లాజ్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైనప్పటినుంచి అత్తారింటిలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెళ్తుందేకానీ, మెట్టినింటికి వెళ్లడం లేదు. 



అయితే, ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో ‘‘అమ్మా ఫాస్ట్‌ఫుట్ సెంటర్‌కు వెళ్తున్నాం.. డబ్బులు కావాలి’’అని అంజూ, నిషా అడిగారు. తల్లి వాళ్ల మాట కాదనకుండా డబ్బులిచ్చింది. ఉదయం వెళ్లిన పిల్లలు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. రాత్రి 7గంటల సమయంలో పెద్ద కొడుకు ధర్మేంద్రకు రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఏమైందోనని కుటుంబ సభ్యులు, స్థానిక నాయకుడు అమీత్ ప్రజాపతితో కలిసి వెళ్లాడు. మార్చురీలో సోదరీమణుల మృతదేహాలు చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. పిల్లల మృతదేహాలు చూసి తల్లిదండ్రుల గుండె బద్దలైనంతపనైంది. 


రైల్వే పోలీసులు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం బీహర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న గూడ్స్  రైలుకు ఎదురుగా వెళ్లి అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ‘రైల్వే పట్టాలపై ఉన్న అక్కాచెల్లెలిని చూసి రైలు డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో వారిద్దరూ పక్కకు తప్పుకొన్నారు. కానీ రైలు వారిద్దరి దగ్గరకు రాగానే.. అక్కాచెల్లెలు చేతులు పట్టుకొని రైలు ముందు పడిపోయారు’అని చెప్పారు. మృతదేహాలను బీవార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. కుటుంబ సభ్యులు వచ్చాకా.. మృతదేహాలను వారికి అప్పగించామన్నారు. అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటో ఇంకా తెలియలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు.




Updated Date - 2021-10-11T17:51:24+05:30 IST