లాక్‌డౌన్ ప్రకటించిన రాజస్థాన్... 24 వరకు అన్నీ మూత!

ABN , First Publish Date - 2021-05-07T22:05:26+05:30 IST

చెలరేగిపోతున్న కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసేందుకు చేసేందుకు ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో

లాక్‌డౌన్ ప్రకటించిన రాజస్థాన్... 24 వరకు అన్నీ మూత!

జైపూర్: చెలరేగిపోతున్న కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసేందుకు చేసేందుకు ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో రాష్ట్రాలన్నీ చివరిగా లాక్‌డౌన్‌ను నమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించగా, తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ చేరింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 10 నుంచి 24 వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.


లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ 14 రోజుల్లో పెళ్లిళ్లు, అంతర్రాష్ట్ర ప్రయాణాలు, ఉపాధిహామీ పథకాలు కూడా ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 31 తర్వాత మాత్రమే వివాహాలకు అనుమతిస్తామని పేర్కొంది. పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ తదితర వాటి కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేయడమో, లేదంటే తర్వాత సర్దుబాటు చేసుకోవడమో చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే, కేవలం 11 మందితో ఇళ్లలోను, ఇండోర్ కోర్టుల్లోనూ పెళ్లిళ్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Updated Date - 2021-05-07T22:05:26+05:30 IST