నేడు మరోసారి రాజస్థాన్ సీఎల్పీ సమావేశం

ABN , First Publish Date - 2020-07-14T16:41:17+05:30 IST

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో మంగళవారం జరగనున్న సీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా..

నేడు మరోసారి రాజస్థాన్ సీఎల్పీ సమావేశం

జైపూర్: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో మంగళవారం జరగనున్న సీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు ఆహ్వానం పంపారు. అయితే తాను సమావేశానికి హాజరు కాబోనంటూ తేల్చి చెప్పారు. మరోవైపు నిన్న జరిగిన సీఎల్పీ భేటీకి 97 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. రాజస్థాన్‌లో ఏ జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 


సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత తనకు 106 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కానీ సమావేశానికి చిన్న పార్టీలు స్వంత్రులతో కలిపి 97 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు మంత్రులు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక ఢిల్లీలో మకాం వేసిన సచిన్ పైలట్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. కానీ ఆయనతో కలిపి 20 మంది మాత్రమే సీఎల్పీకి దూరంగా ఉన్నారు. గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 101 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. దాంతో ఇరు వర్గాలు రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో మంతనాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-07-14T16:41:17+05:30 IST