Elderly couple: 75 ఏళ్ల వయసులో తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు...పండంటి బిడ్డకు జననం

ABN , First Publish Date - 2022-08-10T15:13:33+05:30 IST

పెళ్లి అయిన 54 ఏళ్ల తర్వాత వృద్ధ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన...

Elderly couple: 75 ఏళ్ల వయసులో తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు...పండంటి బిడ్డకు జననం

జైపూర్(రాజస్థాన్): పెళ్లి అయిన 54 ఏళ్ల తర్వాత వృద్ధ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది. 75ఏళ్ల గోపిచంద్, 70 ఏళ్ల చంద్రావతి దేవీలు రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును గ్రామంలో నివాసం ఉంటున్నారు. గోపిచంద్, చంద్రావతి దేవిలకు వివాహమై 54 ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టలేదు. ఈ దంపతులు పిల్లల కోసం పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. ఏడాదిన్నర క్రితం చివరిగా ఈ వృద్ధ దంపతులు అల్వార్ నగరంలోని ఇండో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ సెంటరును సంప్రదించారు.


ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సాంకేతిక సహాయంతో గోపిసింగ్, చంద్రావతి దేవి వృద్ధ దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. వృద్ధదంపతులకు బిడ్డ పుట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవని ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ పంకజ్ గుప్తా చెప్పారు.గోపిసింగ్ మాజీ సైనికుడని, ఇతను బంగ్లాదేశ్ యుద్ధంలో కాలికి గాయమైందని డాక్టర్ పంకజ్ చెప్పారు.తల్లి చంద్రావతి దేవి,బిడ్డ క్షేమంగా ఉన్నారు. చంద్రావతి మూడో సారి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిందని డాక్టర్ చెప్పారు. 


తల్లికి వృద్ధాప్యం వల్ల మేం కాన్పు గురించి భయపడ్డామని, కాని సోమవారం చంద్రావతి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.బిడ్డ బరువు 3.5 కిలోలని డాక్టర్ పేర్కొన్నారు. చంద్రావతి దేవికి సీజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యుడు కల్నల్ రీనా యాదవ్ కూడా మాజీ సైనికుడు కావడం విశేషం. 


Updated Date - 2022-08-10T15:13:33+05:30 IST