ltrScrptTheme3

ప్రియురాలిని అతికిరాతకంగా నరికాడు.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పట్టుకుని.. అతడు చేసిన పనికి షాకైన గ్రామస్థులు..!

Oct 25 2021 @ 12:44PM

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆమెకు ఇంతకుముందే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఓ వివాహితపై ఓ వ్యక్తి అతిగా ఇష్టం పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమె నుంచి కూడా ప్రేమను ఆశించాడు. కానీ అతను అనుకున్నది జరగలేదు. దీంతో ప్రేమించమని వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు ఎక్కువకావడంతో భర్తకు చెప్పింది. ఇది తప్పు అని భర్త కూడా హెచ్చరించాడు. కానీ ప్రియుడి మనసు మారలేదు. చివరికి ఆమెను దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం పట్టుకుని అతడు చేసిన పనికి గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా అహోర్ పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


పట్టణానికి చెందిన థన్వా గ్రామంలో శాంతిలాల్ చౌదరి, శాంతి దేవి(32ఏళ్లు) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త శాంతిలాల్ చౌదరి పని నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడే ఉంటూ ఇంటికి డబ్బులు పంపిస్తుంటాడు. శాంతి దేవి.. అత్తమామ ఇంట్లోనే ఉంటూ.. కరువు పనికి వెళ్తూ పిల్లలను చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. అదే గ్రామానికి చెందిన తనారామ్ మీనా కుమారుడు గణేష్‌‌ అనే 21ఏళ్ల వ్యక్తికి శాంతి దేవి అంటే ఇష్టం కలిగింది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఆ విషయం ఆమెతో కూడా చెప్పాడు. ‘మనమిద్దరం పెళ్లి చేసుకుందాం..’అని ఆమెతో పలుమార్లు చెప్పాడు. ‘పెళ్లైన అమ్మాయిని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాతో ఇలా మాట్లాడడం.. నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు’అని శాంతి దేవి గణేష్‌తో చెప్పింది. 


కానీ అతడు మాత్రం ఆమె వెంటపడడం మానేయలేదు. దీంతో విసిగిపోయిన శాంతి దేవి.. గణేష్ సంగతి భర్తకు చెప్పింది. పద్ధతి మార్చుకోవాలని శాంతిలాల్ హెచ్చరించాడు. కానీ గణేష్ మనసు మారలేదు కదా.. వాళ్లపై కోపం పెంచుకున్నాడు. శాంతి దేవి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఆమె కరువు పనికి వెళ్లడం గమనించాడు. ఆమె వెనుకాలే ఒక పదునైన గొడ్డలి తీసుకుని వెళ్లాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను..’ అని గణేష్ మరోసారి శాంతి దేవితో అన్నాడు. ఆమె అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ తను తెచ్చుకున్న గొడ్డలితో ఆమెపై అతి కిరాతకంగా దాడి చేశాడు. ఎంతలా అంటే.. ఆమె చనిపోయిన కూడా.. అతను శాంతించలేదు. నరుకుతునే ఉన్నాడు. ఆమెతో పాటు పనికి వచ్చిన వాళ్లు గణేష్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ అతడు వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో వాళ్లు ముందుకు రాలేకపోయారు. శాంతిదేవి చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని పట్టుకొని అతడు చేసిన పనికి అక్కడివారందరూ షాక్‌కు గురయ్యారు.


శాంతి దేవి మెడ చుట్టూ చేతులు వేసి.. ఆమె పక్కన పడుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ‘నా ప్రియురాలిని నేనే చంపుకున్నానే..’అని అంటుండడం చూసి గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలాంటి పిచ్చివాడిని ఎక్కడా చూడలేదే అనుకున్నారు. సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చారు. పోలీసులు వచ్చినా గణేష్ ఏమాత్రం బెదరలేదు. ఆమె మృతదేహాన్ని వదిలి పక్కకు రాలేదు. చివరికి గణేష్‌ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శాంతిలాల్ చౌదరి తమ్ముడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నామని, మహారాష్ట్రలో ఉన్న భర్తకు సమాచారం అందించామని, అతడు రాగానే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.