రేయ్.. ఇక్కడ మీ అక్కను కొడుతున్నారురా అని స్నేహితుడు ఫోన్ చేసి చెబితే వెళ్లాడు.. కానీ అక్కడికి వెళ్తే తెలిసిందో దారుణ నిజం!

ABN , First Publish Date - 2021-10-22T17:48:40+05:30 IST

‘రేయ్.. ఎక్కడ ఉన్నావ్.. ఇక్కడ మీ అక్కను..

రేయ్.. ఇక్కడ మీ అక్కను కొడుతున్నారురా అని స్నేహితుడు ఫోన్ చేసి చెబితే వెళ్లాడు.. కానీ అక్కడికి వెళ్తే తెలిసిందో దారుణ నిజం!

ఇంటర్‌నెట్‌డెస్క్: ‘రేయ్.. ఎక్కడ ఉన్నావ్.. ఇక్కడ మీ అక్కను ముగ్గురు కలిసి కొడుతున్నారు.. త్వరగా రారా.. ’అని చెబితే వెళ్లాడు. కానీ సోదరుడు అక్కడికి వెళ్తే ఆమె కనిపించలేదు. స్నేహితుడిని ఏమైందని అడిగాడు.. మీ అక్కను ముగ్గురు వ్యక్తులు కొట్టి ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పాడు. పోలీసులు సహాయంతో ఆమె కోసం గాలిస్తే చివరికి ఓ చోట కనిపించింది. సోదరిని అలా చూసేసరికి తమ్ముడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని నాగపూర్ జిల్లాలో జరిగింది. 


జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి బజారుకు వెళ్లింది. అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి పయనమైంది. కానీ ఆమె ఇంటికి వెళ్తున్నప్పడు ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డుతగిలారు. ఆమెతో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఆమె ఎంతకు లొంగకపోవడంతో.. బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఒకడు కాలితో బలంగా ఆమె కడుపుపై తన్నాడు. వాడి దెబ్బకు ఆమె స్సృహ తప్పి పడిపోయింది. ఆమెను కొట్టి, జడ కత్తిరించి.. పక్కకు తీసుకెళ్లడం ఆమె సోదరుడి స్నేహితుడు చూశాడు. దీంతో అతడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు వారి గ్రామ సర్పంచ్‌కు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసుల వెంట స్నేహితుడు చెప్పిన స్థలానికి వెళ్తే ఆమె కనిపించలేదు. ఆమె కోసం గాలించగా చివరికి ఓ చోట స్పృహ తప్పిపోయి కనిపించింది. సోదరికి జరిగిన అన్యాయం తెలిసి తమ్ముడు షాక్‌కు గురయ్యాడు. ఆ దుర్మార్గులు చంటి పిల్లాడిని కూడా చావబాది.. ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 



బాదితురాలి సోదరుడు మాట్లాడుతూ.. బుధవారం మధ్యాహ్నం తన సోదరి బయటకు వెళ్లిందని, శ్రీరామ్, ఉద్రమ్, జ్ఞానేశ్యామ్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన సోదరిని కొట్టారన్నాడు. తన స్నేహితుడి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లేలోపే ఘోరం జరిగిపోయిందన్నారు.


ఆమె భర్త, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.. నిందితులలో ఒకడు పట్టుబడ్డారని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని శ్రీబాలాజీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.

Updated Date - 2021-10-22T17:48:40+05:30 IST