నవ్వుతూ బయటకు వెళ్లిన 17ఏళ్ల కూతురు.. భయం భయంగా ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయిన తల్లి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-07T16:41:44+05:30 IST

అమ్మా.. బయటకు వెళ్తున్న..

నవ్వుతూ బయటకు వెళ్లిన 17ఏళ్ల కూతురు.. భయం భయంగా ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయిన తల్లి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: అమ్మా.. బయటకు వెళ్తున్న అని చెప్పిన కూతురు ఇంటికి భయం భయంగా రావడం చూసి తల్లి మనస్సు ఏదో కీడు శంకించింది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగ్గా.. షాకింగ్ విషయం చెప్పింది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందే అని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని నాగపూర్ జిల్లాలో జరిగింది. 


జిల్లాకు చెందిన 17ఏళ్ల దళిత యువతి కుచమన్ పట్టణానికి వెళ్లొస్తానని వాళ్ల అమ్మకు చెప్పి బుధవారం 10గంటల సమయంలో ఇంటినుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ ఇద్దరు యువకులు ఆ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఆ యువతిని కొట్టి మత్తుపదార్థం కలిపిన ఆహారాన్ని తినిపించారు. స్పృహ కోల్పోయిన ఆ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అదే రోజు సాయంత్రం 5గంటల సమయంలో ఓ హోటల్ దగ్గర ఆ యువతిని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ యువతి స్థానికుల సహాయంతో ఇంటికి చేరింది. కూతురికి జరిగిన అన్యాయం తెలిసి తల్లి తీవ్రంగా రోదించింది. కుచమన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తల్లీకూతురు ఫిర్యాదు చేశారు.



తల్లీకూతురు ఇంటికి వెళ్లిన కాసేపటికి కొంతమంది పోలీసులు వాళ్ల ఇంటికి ప్రైవేట్ వాహనంలో వెళ్లారు. కేసును విరమించుకోండని హెచ్చిరించారు. పోలీసులు వచ్చిన విషయం తెలిసి గ్రామస్తులు బాధితురాలి ఇంటికి చేరుకొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆగ్రహావేశాలు చూసి పోలీసులు వెనుదిరిగారు. ఫిర్యాదు చేసిన ఏడు గంటల తర్వాత గానీ కేసును నమోదు చేసుకోలేదు. ఆ యువతిని గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.


కొత్తనంబరు నుంచి సోదరుడికి కాల్.. మీ సోదరి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపు..

ఘటన జరిగిన సాయంత్రం బాధితురాలి సోదరుడికి కొత్త నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జరిగిన విషయం పోలీసులకు చెబితే.. మీ సోదరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. 

Updated Date - 2021-10-07T16:41:44+05:30 IST