పదేపదే ఫోన్ చేస్తున్నారని.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది.. చివరకు ఆ 16ఏళ్ల అమ్మాయి ఏమైందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-03T17:42:16+05:30 IST

తాతకు అన్నం తినిపిస్తున్న సమయంలో..

పదేపదే ఫోన్ చేస్తున్నారని.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది.. చివరకు ఆ 16ఏళ్ల అమ్మాయి ఏమైందో తెలిస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: తాతకు అన్నం తినిపిస్తున్న సమయంలో ఆ అమ్మాయి ఫోన్‌కు పదేపదే కాల్స్ వస్తున్నాయి. ఆమె ఆ కాల్స్‌ను కట్ చేస్తూ వచ్చింది. ఫోన్ చేశారు కదా అని.. సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. చివరికి ఆమె జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాకు చెందిన ఓ 16ఏళ్ల అమ్మాయి తన తల్లి, తాత, సోదరుడితో కలిసి ఓ గ్రామంలో నివసిస్తోంది. సోమవారం ఉదయం పని నిమిత్తం తల్లి, సోదరుడు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం అయ్యిందని తాతకు భోజనం తినిపిస్తోంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ఫోన్‌కు పదేపదే కాల్స్ వస్తున్నాయి. ఆమె వాటిని కట్ చేస్తూ ఉంది. అయితే, సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన అమ్మాయి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. ఆమె కోసం ఇంట్లో వాళ్లు గాలించారు. మరుసటిరోజు సాయంత్రం ఊరి చివరన ఓ మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లారు. తన కూతురై ఉండకూడదని ఆ తల్లి అనుకుంది. కానీ అక్కడ ఉన్నది తన కూతురి మృతదేహమే అని తెలిసి తల్లి తల్లడిల్లిపోయింది.



ఎవరో కొంతమంది యువకులు ఆ అమ్మాయిని ఇంట్లోనుంచి బయటకు రప్పించి, గ్రామ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ రాజన్ దుష్యంత్ మాట్లాడుతూ ఇంటర్ సెకండియర్ చదువుతున్న 16ఏళ్ల అమ్మాయి సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిందని, చివరికి గ్రామ శివారు ప్రాంతంలో శవంగా కనిపించిదన్నారు. అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమె తలపై రాయితో బలంగా బాది చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, రిపోర్టు వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందన్నారు.



Updated Date - 2021-11-03T17:42:16+05:30 IST