
కోల్‌కతా : ఐపీఎల్2022లో (IPL 2022) ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు మరో 2 గంటల్లోనే తెరలేవనుంది. కోల్‌కతా వేదికగా Qualifier 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) - రాజస్తాన్ రాయల్స్(Rajastan Royals) తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఫ్యాన్స్‌ని కలవరపరిచే ఓ రిపోర్ట్ వెలువడింది. కోల్‌కతాలో వాతావరణం, వర్ష సూచనల సమాచారం ప్రతికూలంగా ఉన్నాయని రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. కోల్‌కతాలో వర్షం పడుతున్న వీడియోని ట్విటర్లో షేర్ చేసింది. టీం బసు చేస్తున్న హోటల్ నుంచి ఈ వీడియో తీశామని యాజమాన్యం వెల్లడించింది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ వర్షంపడింది. అక్యూవెధర్ వెబ్సైట్ ప్రకారం.. కోల్‌కతాలో మంగళవారం మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే రోజు గడుస్తున్నా కొద్దీ వాతావరణం సాధారణంగా ఉండొచ్చు. అయితే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో మేఘావృతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక మ్యాచ్ సమయానికి వాతావరణం ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.