బాప్‌రే.. బట్లర్‌

ABN , First Publish Date - 2022-06-01T10:17:20+05:30 IST

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్వితీయ ప్రదర్శనతో ఆరు ప్రధాన అవార్డులను కొల్లగొట్టాడు.

బాప్‌రే.. బట్లర్‌

అవార్డుల ద్వారా రూ.95 లక్షల ఆర్జన

ముంబై: ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్వితీయ ప్రదర్శనతో ఆరు ప్రధాన అవార్డులను కొల్లగొట్టాడు. వీటితోపాటు రూ.60 లక్షల ప్రైజ్‌మనీ కూడా దక్కింది. 863 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌, అత్యధిక సిక్సర్లు (45), అత్యధిక ఫోర్లు (83), గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌, పవర్‌ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌, అత్యంత విలువైన ఆటగాడి పురస్కారాల కింద ఒక్కో అవార్డుకు పదేసి లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు లభించాయి.


ఈ 60 లక్షలు కాక లీగ్‌ దశలోని మ్యాచ్‌ల్లో లభించిన అవార్డులకింద ఒక్కో అవార్డుకు రూ. లక్ష రూపాయల చొప్పున రూ. 45 లక్షలు అందుకున్నాడు. మొత్తంగా చూస్తే... బట్లర్‌ ఈ ఐపీఎల్‌లో 37 అవార్డుల ద్వారా రూ.95 లక్షలు ఆర్జించాడు. ఐపీఎల్‌ వేలంలో బట్లర్‌ను రాజస్థాన్‌ జట్టు రూ. 10 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫాస్టెస్ట్‌ డెలివరీ కింద ఫెర్గూసన్‌కు, ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌గా ఉమ్రాన్‌, పర్పుల్‌ క్యాప్‌ ద్వారా చాహల్‌లకు కూడా తలా రూ.10 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.

Updated Date - 2022-06-01T10:17:20+05:30 IST