IPL 2022: లక్నోపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ABN , First Publish Date - 2022-05-16T00:44:41+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడున్నాయి.

IPL 2022: లక్నోపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ మరోమాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.


రాయల్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు మార్గం మరింత సులభమవుతుంది. రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రాసీ స్థానంలో జిమ్మీ నీషమ్, కుల్దీప్ సేన్ స్థానంలో ఒబెడ్ మెక్‌కాయ్ జట్టులోకి వచ్చారు. లక్నో జట్టులో ఒకే ఒక్క మార్పు చోటుచేసుకుంది. కరణ్ శర్మ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు.

Updated Date - 2022-05-16T00:44:41+05:30 IST