ipl 2022: ప్లే-ఆఫ్ బెర్త్‌ కోసం Rajasthan Royals ఆరాటం.. ఇవాల్టి RR vs DC మ్యాచ్‌లో గెలిచేదెవరంటే..

ABN , First Publish Date - 2022-05-11T22:36:47+05:30 IST

IPL 2022 మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్‌పై..

ipl 2022: ప్లే-ఆఫ్ బెర్త్‌ కోసం Rajasthan Royals ఆరాటం.. ఇవాల్టి RR vs DC మ్యాచ్‌లో గెలిచేదెవరంటే..

IPL 2022 మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి ఈ సీజన్‌లో ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్లే-ఆఫ్ బెర్త్‌కు అడుగు దూరంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉన్న రాజస్తాన్ జట్టు ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. నెట్ రన్ రేట్ కూడా కీలకం కానుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి ఏడు మ్యాచుల్లో గెలిచింది. 4 మ్యాచ్‌లు ఓడింది. నెట్ రన్ రేట్ +0.326గా ఉండటం ఆ జట్టు ప్లే-ఆఫ్ అవకాశాలకు కలిసొచ్చే అంశం.



పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచి ఆరు ఓడింది. రాజస్తాన్ టీంలో జాస్ బట్లర్ ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టు ప్రధాన బలం. 11 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి ఈ టోర్నమెంట్‌లోనే ప్రస్తుతం టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా బట్లర్ నిలిచాడు. రాజస్తాన్ బౌలింగ్ విభాగంలో చాహల్ కూడా మంచి దూకుడు మీద ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నాడు. 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్లే-ఆఫ్స్ కోణంలో చూసుకుంటే ఈ రెండు జట్లకు ఇవాల్టి మ్యాచ్ ఎంతో కీలకం. ముంబైలోని Dr DY పాటిల్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుంది.



ఈ గ్రౌండ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 పరుగులుగా స్పోర్ట్స్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రౌండ్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు గెలుపు అవకాశాలు 60 శాతం ఉన్నాయని అంచనా. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బట్లర్ వీర విజృంభణ చేసి 116 పరుగులు చేయడంతో 222 పరుగులు చేసింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 207 పరుగులు చేసింది. 15 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించింది. ఇవాల్టి కీలక మ్యాచ్‌లో ఈ రెండు టీమ్స్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.

Read more