Jyoti Yatra: రాజీవ్‌ స్మారక జ్యోతి యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-11T15:51:40+05:30 IST

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారక జ్యోతి యాత్ర(Jyoti Yatra) ప్రారంభమైంది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లోని రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi)

Jyoti Yatra: రాజీవ్‌ స్మారక జ్యోతి యాత్ర ప్రారంభం

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 10: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారక జ్యోతి యాత్ర(Jyoti Yatra) ప్రారంభమైంది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లోని రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi) స్మారక మందిరంలో బుధవారం ఈ యాత్రను కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌, టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి తదితరులు ప్రారంభించారు. ముందుగా రాజీవ్‌ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ఎంఎస్‌ ద్రవ్యం నేతృత్వంలోని యాత్ర బృందానికి జ్యోతి అప్పగించారు. ప్రత్యేక వాహనాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర ఢిల్లీ చేరుకుంటుంది. ఈ నెల 20వ తేది రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi) జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీలకు ఈ జ్యోతిని అప్పగించనున్నారు. జ్యోతి యాత్ర ప్రారంభోత్సవంలో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏ వాసు, మాజీ ఎమ్మెల్యే మురుగానందం, అగరం గోపి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T15:51:40+05:30 IST