Advertisement

‘క్లైమాక్స్‌’ సెన్సార్‌ పూర్తి.. మార్చి 5న విడుదల

Feb 26 2021 @ 16:19PM

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం 'క్లైమాక్స్‌'.  కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆయన హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  "క్లైమాక్స్". ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని మేకర్స్‌ మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు నటించారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడమే కాకుండా.. అందులో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం చెలరేగింది. ఆ వివాదాలన్నింటికి తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్టే సమాధానం చెప్పేస్తుంది. ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రంపై అంచనాలని అమాంతం పెంచేశాయి. మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకముంది" అన్నారు. 

 

చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ.. ''నటకిరీటి రాజేంద్రప్రసాద్‌గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా విచిత్ర కాన్సెప్ట్‌తో 'క్లైమాక్స్' సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ, ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని కథనాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో  మీ ముందుకు వచ్చేస్తున్నాం.. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.