కార్పొరేషన్‌ మేనేజర్‌గా రాజేంద్ర ప్రసాద్‌

Jul 22 2021 @ 23:26PM
రాజేంద్రప్రసాద్‌

ఆర్వోగా రాజేశ్వరి బదిలీ 

బాలకృష్ణకు ఉద్వాసన 

ఆంధ్రజ్యోతి కథనంపై చర్చ

నెల్లూరు (సిటీ), జూలై 22 : నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో మేనేజర్‌గా ఆర్‌ రాజేంద్రప్రసాద్‌ను తిరిగి నియమిస్తూ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగుతున్న రాజేశ్వరిని తిరిగి ఆర్వోగా వెనక్కు పంపుతూ అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇన్‌చార్జి ఆర్వోగా కొనసాగుతున్న బాలకృష్ణకు అదనపు బాధ్యతల నుంచి ఉద్వాసన పలుకుతూ ఆయన రెగ్యులర్‌ పోస్టు అయిన రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్‌గా కొనసాగించారు. ఈ మార్పులు కార్పొరేషన్‌ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారా యి. ఇదే అంశంపై ఆంధ్రజ్యోతి గురువారం ‘మేనేజర్‌ ఎవరు’ శీర్షికతో ప్రచురించిన కథనం అధికారిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మేనేజర్‌గా రాజేంద్ర ప్రసాద్‌ పేరును దాదాపుగా ఖరారు చేసిన సమయంలో కొత్తగా ఓ మహిళ అధికారి ఆ పోస్టు కోసం పట్టుపట్టినట్లు వదంతులు వ్యాపించాయి. వాటన్నిటినీ తోసిపుచ్చిన కమిషనర్‌ దినేష్‌కుమార్‌ రాజేంద్రప్రసాద్‌నే మేనేజర్‌గా నియమించారు. ఉద్యోగులతో తొలి నుంచి సఖ్యతలేని రాజేశ్వరిపై కమిషనర్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆమె మార్పు తథ్యమైంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.