HYD: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-17T16:12:21+05:30 IST

రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని

HYD: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో  యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రజీ సిద్దిఖీకి రెండో కుమార్తె సుమేరాబేగం అలియాస్‌ ఇరాన్‌(22) భర్త విడాకులు ఇవ్వడంతో ఏడాది కాలంగా ఒంటరిగా  ఉంటుంది. ఈ నెల 1న చింతల్‌మెట్‌ మొఘల్‌ మిడోస్‌-1 అపార్ట్‌మెంట్‌లోని  సబియా వహీద్‌కు చెందిన ఫ్లాట్‌లోకి అద్దెకు దిగింది. ఈ నెల 9న  తన గదిలో స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొంది.  అంతకుపూర్వం అద్దెకున్న ఇంటి కరెంట్‌ బిల్లు చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని వాచ్‌మన్‌ ధర్మేంద్రను పంపింది. సుమేరాబేగం ఫ్లాట్‌కు వచ్చిన ధర్మేంద్ర ఆమె ఇంట్లోంచి వాసన వస్తుండడం గమనించి 100కు డయల్‌ చేశాడు. ఆ తర్వాత చింతల్‌మెట్‌లో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులను కలసి విషయం చెప్పాడు. అత్తాపూర్‌ ఔట్‌పోస్ట్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సుమేరాబేగం ఉరేసుకుని  కనిపించింది.  ఆమె ఇంటికి తరచూ ఓ స్నేహితుడు వచ్చి వెళ్తుంటాడని వాచ్‌మన్‌ చెప్పాడు.


సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌లు

సుమేరాబేగం నివాసం ఉంటున్న మొఘల్‌ మిడో్‌స-1లోని 204 ఫ్లాట్‌ను ఆదివారం రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్యలు పరిశీలించారు. సుమేరాబేగం మానసిక పరిస్థితి సరిగా లేకనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, మృతురాలి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి సమాచారం దొరుకుతుందని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-17T16:12:21+05:30 IST