రాజేంద్రనగర్‌.. రాజెవరో..!

ABN , First Publish Date - 2020-11-29T06:48:32+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఐదు డివిజన్లుండగా వాటిలో సులేమాన్‌ నగర్‌ (57), శాస్త్రిపురం(58) డివిజన్లు మజ్లి్‌సకు కంచుకోటగా ఉన్నాయి.

రాజేంద్రనగర్‌.. రాజెవరో..!

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ  

మజ్లిస్‌ కంచుకోటలుగా సులేమాన్‌ నగర్‌, శాస్త్రిపురం

ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకం

రాజేంద్రనగర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఐదు డివిజన్లుండగా వాటిలో సులేమాన్‌ నగర్‌ (57), శాస్త్రిపురం(58) డివిజన్లు మజ్లి్‌సకు కంచుకోటగా ఉన్నాయి. ఇవి పోను, మరో మూడు డివిజన్లు మైలార్‌దేవుపల్లి(59), రాజేంద్రనగర్‌(60), అత్తాపూర్‌(61) డివిజన్లలో 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తోకల శ్రీనివా్‌సరెడ్డి, కోరని శ్రీలత, రావుల విజయలు గెలుపొందారు. ఈసారి మాత్రం తోకల శ్రీనివా్‌సరెడ్డి మైలార్‌దేవుపల్లి డివిజన్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ టి. ప్రేమ్‌దాస్‌ గౌడ్‌కు దక్కింది. అత్తాపూర్‌ సిటింగ్‌ అభ్యర్థి రావుల విజయ స్థానంలో చెరుకు మాధవిని టీఆర్‌ఎస్‌ బరిలోకి దించింది. రాజేంద్రనగర్‌ డివిజన్‌ నుంచి మరోసారి కోరని శ్రీలత పోటీలో ఉన్నారు. 

ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకం

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని మూడు డివిజన్లను ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యూహాత్మకంగా టికెట్‌ కేటాయింపులు చేయించారు. రాజేంద్రనగర్‌ టికెట్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌కే ఇవ్వగా, అత్తాపూర్‌ నుంచి సిటింగ్‌ను కాదని చెరుకు మాధవికి, మైలార్‌దేవుపల్లిలో తన సోదరుడి వరసయ్యే ప్రేమ్‌దాస్‌ గౌడ్‌కు టికెట్‌ ఇప్పించుకున్నారు. ఈ ముగ్గురి గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే. 

పోటాపోటీ.. 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని సులేమాన్‌ నగర్‌, శాస్త్రిపురం డివిజన్లలో మజ్లిస్‌ బలంగా కనిపిస్తోంది ఈ డివిజన్లలో మజ్లిస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన డివిజన్లలో టీఆర్‌ఎస్‌ బీజేపీ నువ్వా నేనా అన్న స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. మైనారిటీ ఓట్లు టీఆర్‌ఎ్‌సకు ఇక్కడ బలం. గెలిచినా, ఓడినా.. గట్టి పోటీ మాత్రం కచ్చితంగా ఇస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కొంతమేర పోటీ ఇస్తోంది. రాజేంద్రనగర్‌ డివిజన్‌లో సిటింగ్‌ కార్పొరేటర్‌ కోరని శ్రీలత, బీజేపీ అభ్యర్థి పి.అర్చన మధ్యనే ప్రధానంగా పోటీ ఉందని తెలుస్తోంది. అత్తాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. మైనారిటీయేతరుల ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు, యువకుల ఓట్లు తమకే పడతాయని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. ఇక టీఆర్‌ఎ్‌సకు పార్టీ అధికారంలో ఉండటం, సంక్షేమ పథకాలు కలిసొచ్చే అంశంగా ఉండనున్నట్లు అంచనా.

ప్రముఖుల ప్రచారం.. 

టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి కేటీఆర్‌, ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, శాసనమండలి సభ్యుడు డాక్టర్‌  పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, పట్నం నరేందర్‌ రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డిడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎ్‌స.రత్నంలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ మంత్రి బాబూ మోహన్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ ఎంపీలు పొన్నం ప్రబాకర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు.

Updated Date - 2020-11-29T06:48:32+05:30 IST