రజనీకాంత్‌ ‘‘హూట్‌’’ యాప్‌

ABN , First Publish Date - 2021-10-26T08:33:47+05:30 IST

బహుళ భాషా నటుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వాయిస్‌ ఆధారంగా పని చేసే హూట్‌ సోషల్‌ మీడి యా యాప్‌ను ప్రారంభించారు.

రజనీకాంత్‌ ‘‘హూట్‌’’ యాప్‌

న్యూఢిల్లీ : బహుళ భాషా నటుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వాయిస్‌ ఆధారంగా పని చేసే హూట్‌ సోషల్‌ మీడి యా యాప్‌ను ప్రారంభించారు. ఆయన కుమార్తె సౌందర్య ఆమ్‌టెక్స్‌ సీఈఓ సన్నీ పోకలతో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. 60 సెకండ్ల నిడివి గల వాయిస్‌ రికార్డింగ్‌ సదుపాయం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దాన్ని ఉపయోగించి రజనీకాంత్‌ అభిమానులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు, తమ వాయి్‌సతో పంపవచ్చు. అలాగే ఆసక్తి గల అంశాలపై తమ ఆలోచనలు కూడా పంచుకోవచ్చు. 

Updated Date - 2021-10-26T08:33:47+05:30 IST