రాజీవ్‌ స్వగృహ ప్లాటింగ్‌ పనులు వేగవంతం చేయాలి

Published: Sun, 22 May 2022 00:03:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజీవ్‌ స్వగృహ ప్లాటింగ్‌ పనులు వేగవంతం చేయాలి సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

- అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

కరీంనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజీవ్‌ స్వగృహ స్థలాల ప్లాటింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామంలోని రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌లోని స్థలాలను చదును చేసి, సర్వేయర్లతో మ్యాపింగ్‌ చేసి ప్లాటింగ్‌ హద్దురాళ్లను ఏర్పాటు చేసి కలరింగ్‌ చేయాలని అన్నారు. పెద్ద ఫ్లెక్సీలో మ్యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాజీవ్‌ స్వగృహ చీఫ్‌ ఇంజనీర్‌ ఈశ్వరయ్య, మున్సిపల్‌క మిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌వ, ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, తిమ్మాపూర్‌ తహసిల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.