Kamavaram PSలో లొంగిపోయిన రాజీవ్ రతన్

ABN , First Publish Date - 2022-07-07T16:37:52+05:30 IST

కామవరం పోలీస్ స్టేషన్‌(Kamavaram Police Station)లో పీసీసీ(PCC) అధికార ప్రతినిధి రాజీవ్ రతన్ లొంగిపోయారు.

Kamavaram PSలో లొంగిపోయిన రాజీవ్ రతన్

Amaravathi : కామవరం పోలీస్ స్టేషన్‌(Kamavaram Police Station)లో పీసీసీ(PCC) అధికార ప్రతినిధి రాజీవ్ రతన్ లొంగిపోయారు. ప్రధాని మోదీ(PM Modi) పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లు ఎగురవేసిన కేసులో రాజీవ్ రతన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టైన మిగితా వారికి అదే రోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని పర్యటించే హెలికాఫ్టర్ వద్దకు నల్లబెలూన్లతో చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఎస్పీజీ(SPG) సీరియస్గా తీసుకుంది. 


ప్రధాని పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్‌ నాయకులు నిరసన తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ అయి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో నల్లబెలూన్లను గాల్లోకి వదిలారు. దీనికి సంబంధించి పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ ర‌త‌న్‌పై కృష్ణా జిల్లా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పీసీసీ స‌మ‌న్వ‌య‌క‌ర్త సుంక‌ర ప‌ద్మ‌శ్రీ‌తోపాటు మ‌రో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌పై ఐపీసీ 353, 341, 188, 145 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

Updated Date - 2022-07-07T16:37:52+05:30 IST