రాజ్‌కుమార్‌ మనవరాలు హీరోయిన్‌గా ఎంట్రీ

Jul 28 2021 @ 12:21PM

దివంగత ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్‌ మనవరాలు.. కన్నడ నటుడు రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్‌ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె తాజాగా కన్నడలో తెరకెక్కిన  'నిన్నా సానిహకే'లో హీరోయిన్‌గా నటించారు. అయితే కోవిడ్‌ వల్ల ఈ సినిమా రిలీజ్‌ వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి రావడంతో మేకర్స్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నారట.

ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే నా కుటుంబానికి చెందిన అమ్మాయిలకు, బయటివారికి నేనొక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. కారణాలు ఏమైనా మా ఫ్యామిలీ మహిళలు సినిమాల్లోకి రాలేదు. మా తాతగారు (రాజ్‌కుమార్‌) ఒప్పుకోకపోవడం వల్లే అని కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ విషయం గురించి మా అమ్మని అడిగితే, ఏవో భద్రతాపరమైన కారణాలు అని చెప్పారు. ఇప్పుడు 'మీటూ' అంటూ నిర్భయంగా మాట్లాడుతున్నట్లు అప్పట్లో నటీమణులకు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చు. కానీ మా తాతగారు ఇప్పుడుంటే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని నేను హీరోయిన్‌గా చేయడానికి ఒప్పుకునేవారు" అన్నారు. కాగా రాజ్‌కుమార్‌ కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వస్తున్న మొదటి హీరోయిన్‌ ధన్యా రామ్‌కుమార్‌ కావడం విశేషం.

Follow Us on:

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.