రాజ్‌మచీ కోట!

Published: Sun, 09 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజ్‌మచీ కోట!

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉందీ కోట. దీన్ని శాతవాహనులు నిర్మించినా, 1657లో శివాజీ పరిపాలనలోకి వచ్చాక బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శివాజీ ఈ కోటను మరింతగా విస్తరించాడు. కోట ప్రాంగణంలో అనేక నిర్మాణాలు చేపట్టాడు. 1704లో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే మళ్లీ మరాఠాల చేతుల్లోకి వెళ్లింది. 18వ శతాబ్దంలో ముంబయి, పుణేల మధ్య వర్తకం బాగా జరిగేది. ఆ దారిలోనే ఈ  కోట ఉండటంతో వర్తకులు ఇక్కడ విశ్రాంతి కోసం ఆగేవారు. 19వ శతాబ్దంలో మరాఠాల చేతుల్లో నుంచి బ్రిటిష్‌ వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కోటను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఈ కోట శ్రీవర్దన్‌ హిల్‌, మనరంజన్‌ హిల్‌ అనే రెండు కొండల మధ్య నిర్మించారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఈ కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడున్న కాలభైరవ ఆలయం, శివాలయం మహిమగలవిగా ప్రసిద్ధి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.