Ex-servicemen : మాజీ సైనికుల అనాథ పిల్లలకు సాయం పెంపు : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-07-30T18:13:23+05:30 IST

మాజీ సైనికుల (ex-servicemen) అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

Ex-servicemen : మాజీ సైనికుల అనాథ పిల్లలకు సాయం పెంపు : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : మాజీ సైనికుల (ex-servicemen) అనాథ పిల్లలకు ఆర్థిక సాయం పెంపునకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి పట్ల మానవతావాద దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు. 


రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Sing) తెలిపిన వివరాల ప్రకారం మాజీ సైనికుల అనాథ బాలలకు ఇకపై నెలకు రూ.3,000 చొప్పున  అందజేస్తారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ.1,000 లభించేది. ఈ సాయం వల్ల అనాథ బాలలు గౌరవప్రదంగా, మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుంది. 


ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, కేంద్రీయ సైనిక్ బోర్డు (Kendriya Sainik Board) నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందజేస్తారు. రక్షా మంత్రి ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఫండ్ ఈ నిధులను సమకూర్చుతుంది. 


మాజీ సైనికుల చట్టబద్ధ సంతానానికి ఈ పథకం వర్తిస్తుంది. 21 సంవత్సరాల వయసు లోపుగల కుమారుడు, అవివాహిత కుమార్తె ఈ పథకం క్రింద లబ్ధి పొందేందుకు అర్హులు. జిల్లా సైనిక్ బోర్డులు ఈ దరఖాస్తులను సిఫారసు చేస్తాయి. 


Updated Date - 2022-07-30T18:13:23+05:30 IST