Madi in India: లైట్ కంబాట్ హెలికాప్టర్‌ 'ప్రచండ్'లో ప్రయాణించిన రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2022-10-03T19:49:25+05:30 IST

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం ప్రచండ్‌ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి..

Madi in India: లైట్ కంబాట్ హెలికాప్టర్‌ 'ప్రచండ్'లో ప్రయాణించిన రాజ్‌నాథ్

జోథ్‌పూర్: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) ప్రచండ్‌ (prachand)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) సోమవారంనాడు ప్రయాణించారు. ఈ సరికొత్త కంబాట్ హెలికాప్టర్లను జోథ్‌పూర్‌లో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో భారత వైమానిక దళంలో (IAF) ప్రవేశపెట్టారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌ నుంచి ప్రచండ్‌ హెలికాప్టర్‌లో కొద్దిసేపు ప్రయాణించారు. ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) అభివృద్ధి చేసిన ఈ ఎల్‌సీహెచ్‌లను ప్రధానంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించేందుకు వీలుగా డిజైన్ చేశారు.


''దేశీయంగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ చాలా స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలాంటి పర్వత ప్రాంతాల్లోనైనా, ఎత్తు, వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనేదే మా నినాదం'' అని హెలికాప్టర్‌లో ప్రయాణం అనంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎల్‌సీహెచ్‌ల  ప్రవేశంతో ఐఏఎఫ్ పోరాట పటిమ మరింత పెరిగిందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-10-03T19:49:25+05:30 IST