అమర జవాన్ కూతురు Haryana పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్‌‌గా ఎంపిక

ABN , First Publish Date - 2021-11-08T14:03:45+05:30 IST

ఓ అమర జవాను కుమార్తె పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన ఘటన హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో వెలుగుచూసింది....

అమర జవాన్ కూతురు Haryana పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్‌‌గా ఎంపిక

చండీఘడ్ : ఓ అమర జవాను కుమార్తె పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన ఘటన హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ ప్రాంతానికి చెందిన మంగత్ రామ్ ఇండియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో పనిచేశారు. 2002 ఆగస్టులో జమ్మూకశ్మీరులోని రాజౌరిలో పనిచేస్తూ మంగత్ రామ్ కాల్పుల్లో మరణించి అమరజవానుగా నిలిచారు. దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగం తర్వాత అమరజవాను మంగత్ రామ్ కుమార్తె నాన్సీసైనీ హర్యానా పోలీసు విభాగంలో సబ్ఇన్‌స్పెక్టర్‌ గా ఎంపికయ్యారు.



ఎస్ఐగా తాను సాధించిన విజయంలో తన తల్లి సునీతారైనీ, సోదరుడు గౌరవ్ సైనీ మద్ధతుగా నిలిచారని నాన్సీసైనీ చెప్పారు. తన తండ్రి మంగత్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేసేందుకు తాను పోలీసుశాఖలో చేరినట్లు నాన్సీసైనీ చెప్పారు. 

 

Updated Date - 2021-11-08T14:03:45+05:30 IST