డ్వామా పీడీగా రాజు

ABN , First Publish Date - 2022-08-10T05:08:43+05:30 IST

జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా చిట్టి రాజు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇప్పటివరకు నరసన్నపేట ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు ఏపీడీ రోజారాణి ఇన్‌చార్జి డ్వామా పీడీగా వ్యవహరించారు. తాజాగా చిట్టి రాజు పీడీగా బాధ్యతలు స్వీకరించారు.

డ్వామా పీడీగా రాజు
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డ్వామా పీడీ రాజు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 9: జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా చిట్టి రాజు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇప్పటివరకు నరసన్నపేట ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు ఏపీడీ రోజారాణి ఇన్‌చార్జి డ్వామా పీడీగా వ్యవహరించారు. తాజాగా చిట్టి రాజు పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు సిబ్బంది సహకారం అవసరమని తెలిపారు. గ్రామాల్లో ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే ప్రజలకు ఉపాధి కల్పించి వలసలను నివారించాలని చెప్పారు. జాబ్‌ కార్డు ఉన్నవారికి ఉపాధి చూపించడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్‌ సరోవర్‌ కింద చేపడుతున్న చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముందుగా ఆయన కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమావేశంలో ఏపీడీలు వాసుదేవరావు, లవరాజు, జయరాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-10T05:08:43+05:30 IST