రాజ్యాంగంతో దళితులకు స్వేచ్ఛ

ABN , First Publish Date - 2020-11-27T05:15:29+05:30 IST

అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం దళితులకు కొండంత అండ కలిగించిందని జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం.కమలమ్మ అన్నారు.

రాజ్యాంగంతో దళితులకు స్వేచ్ఛ


జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ కమలమ్మ

గిద్దలూరు టౌన్‌, నవంబరు 26: అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం  దళితులకు కొండంత అండ కలిగించిందని జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం.కమలమ్మ అన్నారు. బుధవారం పట్టణంలోని హరిప్రి య ఫంక్షన్‌ హాలులో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 71వ భా రత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమలమ్మ మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు అ న్నిరంగాల్లో రాణించేందుకు రాజ్యాంగం దారులు చూపిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం ద్వారా దళితులకు రక్షణ కలిగిందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎ స్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షుడు జె.ప్రభాకర్‌, నియోజకవర్గ కన్వీనర్‌ పెరికె మహేష్‌బాబు, కొమరోలు మండల కన్వీనర్‌ గుర్రం ప్రభాకర్‌బాబు, మార్కాపురం నియోజకవర్గ మహిళ కన్వీనర్‌ నందిగామ సుష్మిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:15:29+05:30 IST