ఆశలన్నీ ఆత్మసాక్షి ఓట్లపైనే..!

ABN , First Publish Date - 2022-06-08T17:20:11+05:30 IST

రాజ్యసభలోని నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్‌ అనివార్యం కానుంది. కాంగ్రెస్‌ మొదటి అభ్యర్థి జైరాం రమేశ్‌ విజయం

ఆశలన్నీ ఆత్మసాక్షి ఓట్లపైనే..!

- రాజ్యసభ నాలుగో స్థానం కోసం ఎత్తులు 

- 10న ఎన్నికలు


బెంగళూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలోని నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్‌ అనివార్యం కానుంది. కాంగ్రెస్‌ మొదటి అభ్యర్థి జైరాం రమేశ్‌ విజయం ఖాయం కానుండగా రెండో అభ్యర్థి మన్సూర్‌ అలీఖాన్‌ను కూడా గెలిపించుకునేందుకు పార్టీ అగ్రనేతలు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆత్మసాక్షి ఓట్లపైనే ఉభయనేతలూ భారీ ఆశలు పెట్టుకున్నారు. మతోన్మాద బీజేపీకి గుణపాఠం నేర్పేందుకు జేడీఎస్‌ తమతో చేతులు కలపాలని శాసనసభ ప్రతిపక్షనేత సిద్దరామయ్య మైసూరులో చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసనసభలో కేవలం 37 స్థానాలు కలిగిన జేడీఎ్‌సకు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అప్పగించామని గుర్తు చే సిన ఆయన, మతోన్మాదుల గురించి మాటల్లో కాకుండా చేతల్లో చూపాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ, జేడీఎ్‌సకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో చేతులు కలుపుతారన్న ఆశాభావాన్ని వ్య క్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని, వేచి చూడాలని బదులిచ్చారు. అటు జేడీఎస్‌ కూడా ఆత్మసాక్షి ఓట్లపైనే ఆశలు పెట్టుకోవడంతో రాజ్యసభ ఎన్నికల పోరు మరింత కుతూహలంగా మారింది. బీజేపీ కూడా ఆత్మసాక్షి నినాదాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఖచ్చితంగా రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ మిగులు ఓట్లను అటు కాంగ్రెస్‌, జేడీఎస్‌ వైపు మళ్లకుండా ఆ పార్టీ వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్సీ లెహర్‌సింగ్‌ను బరిలోకి దింపిన సంగతి విదితమే. ఈనెల 10న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ ఫలితాలు ఆశ్చర్యకరంగాను, విస్మయకరంగానూ ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంకు తూహలం కలిగిస్తోంది.

Updated Date - 2022-06-08T17:20:11+05:30 IST