Rakesh Jhunjhunwala: వీల్ చెయిర్‌పైనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-08-14T22:59:42+05:30 IST

ముంబై: గుండెపోటుతో ఈ తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పాత వీడియో

Rakesh Jhunjhunwala: వీల్ చెయిర్‌పైనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్.. వీడియో వైరల్

ముంబై: గుండెపోటుతో ఈ తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పాత వీడియో ఒకటి వైరల్ అయింది. బంటీ ఔర్ బబ్లీ అనే హిందీ సినిమాలోని కజ్రా రే అనే పాటపై ఆయన డ్యాన్స్ చేశారు. మూత్రపిండాల సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకున్నా ఆయన జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసేవారని ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు ఈ వీడియోనే ఉదాహరణ అంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ ట్వీట్ చేశారు. వీడియోను కూడా జత చేశారు. వీడియోలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తన బంధుమిత్రులతో కలిసి సందడిగా గడిపారు. వీల్‌చెయిర్‌కే పరిమితమైనా మ్యూజిక్‌కు అనుగుణంగా శరీరాన్ని కదిలించడమే కాక పాటలో సాహిత్యానికి తగినట్లుగా అభినయం కూడా చేశారు. ఝున్‌ఝున్‌వాలా మిత్రులు ఈ వీడియోను చూసి కంటతడిపెట్టుకుంటున్నారు. 





62 సంవత్సరాల రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇటీవలే తన బిజినెస్ వెంచర్‌లో భాగంగా వైమానిక సంస్థ సేవలను ప్రారంభించారు. 


విద్యార్థి దశలో 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇప్పటివరకూ 40 వేల కోట్ల రూపాయలు సంపాదించారు. 



Updated Date - 2022-08-14T22:59:42+05:30 IST