Rakesh Tikait పై ఇంకు దాడి

ABN , First Publish Date - 2022-05-30T19:41:18+05:30 IST

భారతీయ కిసాన్ యూనియన్ (Bharatiya kisan union) ప్రతినిధి, రైతు నేత రాకేష్ టికాయిత్‌ (Rakesh Tikayit) పై ..

Rakesh Tikait పై ఇంకు దాడి

బెంగళూరు: భారతీయ కిసాన్ యూనియన్ (Bharatiya kisan union) ప్రతినిధి, రైతు నేత రాకేష్ టికాయత్‌ (Rakesh Tikayit) పై ఇంకు దాడి (Ink attack) జరిగింది. బెంగళూరులో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ వెన్యూ‌ వద్ద జనాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విరుసుకుంటూ గందరగోళం సృష్టించారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగా సుమారు డజను మంది అక్కడకు చేరుకుని టికాయత్‌పై ఇంక్ చల్లారు. దీంతో అక్కడ గందరగోళం తలెత్తింది. ఈ ఘటనకు స్థానిక పోలీసులదే బాధ్యతని టికాయత్ ఆరోపించారు. పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని అన్నారు. ఒక స్టింగ్ ఆపరేషన్‌లో రైతు నాయకుడు ఒకరు డబ్బు అడుగుతూ కెమెరాకు చిక్కారంటూ వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు టికాయత్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో సాగచట్టాలకు వ్యతిరేకంగా రసనలు జరిపిన కిసాన్ సంయుక్త మోర్చా సమన్వయ కమిటీ ఏడుగురు సభ్యుల్లో టికాయత్ ఒకరు.


కాగా, తాజా పరిణామాలపై రైతు నేత అవిక్ షా మాట్లాడుతూ, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం దేశంలోని నలుమూలలకూ వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని, ఉద్యమాన్ని పటిష్టం చేస్తుందని, త్వరలోనే ఆ పని చేస్తామని చెప్పారు. వారం పది రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

Updated Date - 2022-05-30T19:41:18+05:30 IST