రాఖీతో రక్ష!

ABN , First Publish Date - 2020-08-03T07:48:08+05:30 IST

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు గురు అయిన రాఖీ పండగ వెనక పురాణ కథ ఉంది. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు తన

రాఖీతో రక్ష!

ఈ రోజు రాఖీ పండుగ. మరి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సోదరుడికి రాఖీ కట్టేయండి. ఇంతకీ రాఖీ పండుగ ఎందుకు జరుపుకొంటామో తెలుసా?

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు గురు అయిన రాఖీ పండగ వెనక పురాణ కథ ఉంది. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు తన పరివారంతో అమరావతిలో తలదాచుకుంటాడు. భర్తను ఎలాగైనా కాపాడాలని శచీదేవి ఆలోచిస్తుంది. సరిగ్గా ఆ రోజు పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. దాంతో ఇంద్రుడు రెట్టింపు ఉత్సాహంతో వెళ్లి యుద్ధంలో గెలిచి వస్తాడు. రాఖీ గురించి ఇలాంటి పురాణ కథలు చాలానే ఉన్నాయి. కథ ఏదైనా సోదరుడి విజయాన్ని ఆకాంక్షిస్తూ కట్టేదే రాఖీ. 

రాఖీలు ఆకర్షణీయంగా ఉన్నాయని కొనకుండా, సహజరంగులతో తయారుచేసిన రాఖీలను తీసుకోండి. వీటితో ఏ ప్రమాదం ఉండదు. ఇవి పర్యావరణానికి హాని చేయవు.

కార్టూన్‌ బొమ్మల రాఖీలను కొనొచ్చు. రాఖీలపై ప్లాస్టిక్‌తో తయారైన కార్టూన్‌ బొమ్మలుంటే వాటిని పడేయకండి. వాటిని ఇంటి అలంకరణలో వాడొచ్చు. రఫ్‌ నోట్‌బుక్‌ మీద, టిఫిన్‌ బాక్స్‌మీద ఆ కార్టూన్‌ బొమ్మలను అతికించుకోవచ్చు. 

వీలైతే ఇంట్లోనే రాఖీ తయారుచేయండి. నూలు దారం, చెక్కతో చేసిన పూసలు తీసుకోండి. రాఖీ తయారుచేసే సమయంలో అవసరమైతే మమ్మీ లేదా డాడీ సహాయం తీసుకోండి.

Updated Date - 2020-08-03T07:48:08+05:30 IST