అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

ABN , First Publish Date - 2022-08-12T05:45:04+05:30 IST

అన్నా చెల్లెళ్ల అనుబంధం, ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే, నాయకులు, లబ్ధిదారులు

- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

గద్వాల క్రైం, ఆగస్టు 11 : అన్నా చెల్లెళ్ల అనుబంధం, ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, నేతన్న బీమా, సీయం సహాయనిధి లబ్ధిదారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జిల్లా సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో మహిళల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గుర్తు చేస్తూ, ఆడపడుచులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులు రజియాబేగం, రజిత, లలిత,  ఎంపీపీలు ప్రతాప్‌గౌడు, విజయ్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ బాబర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:45:04+05:30 IST