రకుల్ అదే చెప్పలేకపోతోంది

May 14 2021 @ 16:55PM

రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీకొచ్చి దాదాపు 11 ఏళ్ళు అవుతున్నా సక్సెస్‌కు కారణాలేంటో చెప్పలేకపోతోందట. 2009లో ఈమె కన్నడ సినిమా 'గిల్లీ'తో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో 'కెరటం' ద్వారా ఎంట్రీ ఇచ్చి 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలో పోషించిన ప్రార్ధన పాత్రతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని రాం చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, సాయి ధరం తేజ్, ఎన్.టి.ఆర్., మహేష్ బాబు, గోపీచంద్, లాంటి స్టార్ హీరోలందరితోను నటించి సూపర్ హిట్స్ అందుకుంది. అయితే తను అందుకునే ఈ సక్సెస్‌లకు కారణాలు ఏమై ఉంటాయని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయిందట. 

 

నేను చేసిన సినిమా బావుందని స్వయంగా ప్రేక్షకులు చెప్పినప్పుడు కలిగే ఆనందం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలాంటప్పుడే ప్రస్తుతం ఉన్న స్టార్ డమ్ కోల్పోతానేమో అనే భయం తనలో కలుగుతుందంటోంది. ఈ మధ్య తెలుగులో అంతగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ మీద దృష్టి సారించి సక్సెస్ అయింది. అక్కడ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం 'మేడే', 'ఎటాక్', 'ఇండియన్ 2', 'థాంక్ గాడ్', ఆయుష్మాన్ ఖురానాతో 'డాక్టర్ జి' సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి. అర్జున్ కపూర్‌తో నటించిన 'సర్దార్ కా గ్రాండ్‌సన్' ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.     

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.