ఫిట్‌నెస్‌పై రకుల్‌ దృష్టి

Jun 2 2021 @ 12:11PM

ఇటు కోలీవుడ్‌తో పాటు అటు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో ఫెయిల్యూర్స్‌తో ఎలాంటి సంబంధం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు మహిళల కోసం ప్రత్యేక ఫిట్‌నెస్‌ సెంటర్లను నెలకొల్పింది. ఈ సెంటర్లు ప్రస్తుతం హైదరాబాద్‌, వైజాగ్‌లలో ఉన్నాయి. అంతేకాకుండా, మహిళల స్వీయరక్షణ చర్యల్లో భాగంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై ఆమె దృష్టి  సారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ముందుగా ఆమె శిక్షణ పొందుతోంది. ఇదిలావుంటే, ఇటీవల రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తనలోని మరో టాలెంట్‌ను ప్రపంచానికి తెలియపరిచింది. ఇదే విషయంపై ఆమె ఒక ట్వీట్‌ చేస్తూ, తన కుటుంబానికి చెందిన అనేక మంది ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నారని, అందుకే చిన్నప్పటినుంచి ఎంతో క్రమశిక్షణతో పెరిగానని తెలిపింది. అలాగే, తనకు గోల్ఫ్‌ క్రీడ అంటే ఎంతో ఇష్టమని, ఆ ఆసక్తితోనే పాఠశాలలో చదువుకునే రోజుల్లో మొత్తం 14 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నానని, ఇప్పుడు కూడా సమయం దొరికినపుడల్లా మైదానానికి వెళ్ళి గోల్ఫ్‌ ఆడతానని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది.   

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.