విపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-04T03:35:45+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

విపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పాల్వంచ టౌన్‌, డిసెంబరు 3: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, టీజేఎస్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ, సీపీఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, టీజేఎస్‌ జిల్లా నాయకులు బరగడ దేవదానం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడారు. ధర్నా చేస్తున్న రైతులతో వెంటనే చర్చలు జరపాలని వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చట్టాలను తక్షణం విరమించుకోవాలని కోరారు.


Updated Date - 2020-12-04T03:35:45+05:30 IST