కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో ర్యాలీ

ABN , First Publish Date - 2021-04-23T05:04:56+05:30 IST

వన్య ప్రాణుల సంరక్షణ కోసం అడవుల్లోని ప్రదేశాలను ఆ శాఖ అధికారులు గురువారం సందర్శించారు. ఈ మేరకు భారత్‌ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మండలంలోని సిరిసెల్మ అటవీ శాఖ పరిధిలో అధికారులు ర్యాలీ నిర్వహించారు.

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో ర్యాలీ

ఇచ్చోడరూరల్‌, ఏప్రిల్‌ 22: వన్య ప్రాణుల సంరక్షణ కోసం అడవుల్లోని ప్రదేశాలను ఆ శాఖ అధికారులు గురువారం సందర్శించారు. ఈ మేరకు భారత్‌ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మండలంలోని సిరిసెల్మ అటవీ శాఖ పరిధిలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. వన్య ప్రాణులకు వేసవి కాలంలో నీటి లభ్యత, వాటి ఆహారం వాటి సంరక్షణ, వన్య ప్రాణులు తిరిగే ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అడవుల్లో వన్య ప్రాణుల నీటి కొరత తీర్చడానికి నిర్మించిన నీటి కొలనులను పరిశీలించారు. కార్యక్రమంలో టైగర్‌ జోన్‌ ఎఫ్‌ఆర్‌వో వాహబ్‌ అహ్మద్‌తో పాటు అటవీ శాఖ ఉద్యోగులు శ్రీనివాస్‌, నితీష్‌, చిరంజీవి, భీంరావ్‌, రాధ, కృష్ణ, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:04:56+05:30 IST