నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విశ్వనాథన్ వలందరరేవు వద్ద ఓటు హక్కు పై ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు. ఓటు హక్కుతో మనకు నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ తెలిపారు.