ప్రతీ ఇంట జాతీయ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2022-08-11T05:36:33+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతీ ఇంటా జాతీయ జెండా ఎగుర వేద్దామని కలెక్టర్‌ పి.ప్రశాంతి పిలుపు నిచ్చారు.

ప్రతీ ఇంట జాతీయ జెండా ఎగరాలి
భీమవరంలో ఇంటింటా జెండాల పంపిణీలో కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం టౌన్‌, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతీ ఇంటా జాతీయ జెండా ఎగుర వేద్దామని కలెక్టర్‌ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ప్రతీ ఇంటికి జెండా పం పిణీ, జాతీయ జెండాతో ర్యాలీని బుధవారం ఆమె ప్రారంభించారు. ముందు గా మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మహిళ లకు జెండాలను అందజేశారు. కాలనీలో 600 ఇళ్లకు జాతీయ జెండాలు కట్టిన కాలనీ అసోసియేషన్‌ సభ్యులను ఆమె అభినందించారు. ఆర్డీవో దాసి రాజు, పాతపాటి సర్రాజు, తహసీల్దార్‌ వై.రవి కుమార్‌, ఎంపీడీవో జిపద్మ, కంతేటి వెంకట్రాజు, చెరుకువాడ రంగసాయి, కుక్కలబాల వెంకటరత్నం, సరిపిడకల రామారావు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.


ఆచంట: ఆచంట శివారు పోర పాఠశాల విద్యార్థులతో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల వద్ద సమావేశం ఏర్పాటుచేసి జాతీయ జెండా విశిష్టతను హెచ్‌ఎం త్రిమూర్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


పెనుగొండ: భాష్యం పాఠశాలలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 75 వసంతాలను మానవహారం రూపంలో ప్రదర్శించారు. ప్రిన్సిపాల్‌ వెంకట అప్పారావు, రాణి రోజాజి పాల్గొన్నారు.


ఉండి: పోరాట యోధుల జీవితాలను యువత స్ఫూరిగా తీసుకోవాల ని ఎమ్మెల్యే మంతెన రామరాజు పిలుపునిచ్చారు. కలిగొట్లలో జాతీయ పతా కాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతీ ఇంట జాతీయ జెండా రెపరెపలాడాల న్నారు. సర్పంచ్‌ సత్యసూర్యనారాయణ, జుత్తుగ శ్రీనివాసరావు, ఎంపిటీసీ రుద్రరాజు యువరాజు, యశోధకృష్ణయ్య, నీలం సూర్యనారాయణ, పొత్తూరి ప్రసాదరాజు, శిరవరపు ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:36:33+05:30 IST