ఆ క్రేజ్ కోసమే రూట్ మార్చిన రామ్..?

Jun 6 2021 @ 16:39PM

ఎనర్జిటిక్ హీరో రామ్ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ కోసమే రూట్ మార్చి వరుసగా బైలింగ్వెల్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో. బాలీవుడ్ జనాలకి 'ఇస్మార్ట్ శంకర్' బాగా కనెక్ట్ అయింది. ఈ క్రేజ్ కంటిన్యూ చేస్తూ తమిళ హిట్ సినిమా 'తడమ్' తెలుగు రీమేక్ 'రెడ్‌'లో నటించాడు. ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా మాస్ హీరోగా డ్యూయల్ రోల్‌లో రామ్ బాగా ఆకట్టుకున్నాడు. అయితే ఇకపై తన సినిమాలు సౌత్ భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. తమిళ భాషలో మార్కెట్ సాధిస్తే నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ మార్కెట్ అంటున్నారు. అంతేకాదు త్వరలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేసేలా రామ్ కథలు వింటున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల ఏ.ఆర్.ముదగదాస్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.