ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్‌ని కూడా రాజమౌళి బృందం అధికారకంగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. పెద్దగా సమయం లేకపోవడంతో రాజమౌళి చరణ్‌కి ఎక్కువ బ్రేక్ ఇవ్వలేదని సమాచారం. ఇక ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ గోండు వీరుడు కొమరం భీమ్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' రెండు భాగాలతో తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్ని సంచనాలు సృష్టించబోతున్నాడో అన్న ఆతృత దేశ వ్యాప్తంగా నెలకొంది.