Kamal Haasan ‘Vikram’: తెలుగు ట్రైలర్ వదిలిన మెగా పవర్ స్టార్

Published: Fri, 20 May 2022 19:24:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Kamal Haasan Vikram: తెలుగు ట్రైలర్ వదిలిన మెగా పవర్ స్టార్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil )‪తో పాటు  సూర్య (Suriya) అతిథి పాత్రలో అలరించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‪ని మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) విడుదల చేశారు. ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో హీరో నితిన్ (Nithiin) కి చెందిన శ్రేష్ట్ మూవీస్ (Sreshth Movies) సంస్థ జూన్ 03న భారీగా విడుదల చేయబోతోంది. 


ట్రైలర్ విషయానికి వస్తే..

‘‘అడవి అన్నాక పులి, సింహం, చిరుత అన్నీ వేటకు వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోగా సూర్యాస్తమయం ఐతే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ, ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను’’ అని కమల్ హాసన్  పవర్ ఫుల్ డైలాగ్‪తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘‘నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్‪తో పని లేదు. నా గవర్నమెంట్‪ని నేను తయారు చేసుకోగలను’’ అనే డైలాగ్‪తో విజయ్ సేతుపతి ఎంట్రీని కూడా చూపించారు. అలాగే ఫహద్ ఫాసిల్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్ అన్నట్లుగా వుంది. చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా గ్రాండ్ వున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ నిండిన 2నిమిషాల 38సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలని పెంచేదిగా ఉంది.


భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ (Girish Gangadharan) సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ (Philomin Raj) ఎడిటర్‪గా పని చేస్తున్నారు. జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి.. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ యాక్షన్ ప్యాక్‪డ్ ట్రైలర్‪ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేయగా.. చరణ్‪కు నితిన్‪తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ధన్యవాదాలు తెలిపారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International