రామ్‌ చరణ్‌ పాటా.. ఫైటూ!

Published: Wed, 06 Jul 2022 00:27:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రామ్‌ చరణ్‌ పాటా.. ఫైటూ!

రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కైరా అడ్వాణీ కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. ఈ చిత్రం కోసం ‘అధికారి’, ‘సిటిజన్‌’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ - కైరా మధ్య ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. దాదాపు వెయ్యిమంది డాన్సర్లు ఈ చిత్రీకరణలో పాలుపంచుకొంటున్నారని సమాచారం. గణేష్‌ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట పూర్తవగానే ఓ భారీ పోరాట దృశ్యాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నార్ట. ఈ పాటా, ఫైటూ.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం 40 శాతం షూటింగ్‌ జరిగిందనీ, ఈ యేడాది చివరి నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు విడుదల వేసవికి మారిందని తెలుస్తోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International