Advertisement

పవన్‌ సినిమాను అలా ప్లాన్‌ చేస్తున్న సురేందర్‌ రెడ్డి..!

Sep 27 2020 @ 09:47AM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ తర్వాత డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ మేకర్‌గా పేరున్న సురేందర్‌ రెడ్డి తమ అభిమాను హీరోను ఎలా చూపిస్తాడోనని పవన్‌ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌ ఇంటర్వ్యూలో రామ్‌ తాళ్లూరి ఈ సినిమా గురించి మాట్లాడారు. సురేందర్‌ రెడ్డి గతంలో తెరకెక్కించిన రేసుగుర్రం తరహా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, కమర్షియల్‌ అంశాలతో పాటు మంచి మెసేజ్‌ కూడా సినిమాలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అఖిల్‌ అక్కినేని, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన తర్వాత పవన్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను సురేందర్‌ రెడ్డి మొదలు పెడతారని టాక్‌. 


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.