పేకాట శిబిరాలపై దాడి .. 25 మంది అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-09T11:34:22+05:30 IST

ఏలూరు రామ చంద్రరావుపేట వెంకటే శ్వరస్వామి గుడి సమీపంలో శ్రీసత్య రెసిడెన్సీలో పేకాట ..

పేకాట శిబిరాలపై దాడి .. 25 మంది అరెస్ట్‌

ఏలూరు క్రైం/యలమంచిలి/తాడేపల్లిగూడెం క్రైం, ఆగస్టు 8 : ఏలూరు రామ చంద్రరావుపేట వెంకటే శ్వరస్వామి గుడి సమీపంలో శ్రీసత్య రెసిడెన్సీలో పేకాట ఆడుతున్నట్టు టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాలతో ఎస్‌ఐ బి.నాగబాబు సిబ్బందితో శనివారం రాత్రి దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసి వారం నుంచి లక్షా ఐదు వేల రూపా యల నగదును స్వాధీ నం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఏనుగువానిలంక గ్రామ శివారులో..

యలమంచిలి మండలంలోని ఏనుగు వానిలంక శివారులో పేకాట శిబిరంపై పాలకొల్లు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంక టేశ్వరరావు ఆఽధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీసులు దాడిచేసి 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై కె.గంగాధరరావు తెలిపారు. ఏనుగువానిలంక గ్రామ శివారు పోలవరం ప్రాంతంలోని ఒకగృహంపై ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు.వారి నుంచి రూ.1,16,290 నగదు, 11 సెల్‌ ఫోన్లు, 5 మోటారు సైకిళ్లను స్వాఽధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


తాడేపల్లిగూడెంలో..

తాడేపల్లిగూడెంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.63,800 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఆకుల రఘు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్న ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా ఉండటమే కాకుండా నాన్‌ గేమింగ్‌ చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ గుర్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:34:22+05:30 IST