రామయ్య భూములు రక్షించాలి

ABN , First Publish Date - 2022-06-25T04:44:40+05:30 IST

ఎటపాకలో రామయ్య భూములను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌, మాతృశక్తి, బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం ధర్నా నిర్వ హించారు.

రామయ్య భూములు రక్షించాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం

హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల డిమాండ్‌

ఎటపాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

భద్రాచలం, జూన్‌ 24: ఎటపాకలో రామయ్య భూములను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌, మాతృశక్తి, బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం ధర్నా నిర్వ హించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజుపాడేరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం లో ఉన్న రామయ్య భూములు పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం ఎటపాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూములను అక్కడి స్థానికులు ఆక్రమించుకుని రకరకాల అక్రమ నిర్మా ణాలు చేపడుకున్నారని వారు ఆరోపించారు.ఈ విషయమై భద్రాచల దేవస్థానం వారు న్యాయ స్థానా నికి వెళ్లగా.. కోర్టు తీర్పు కూడా దేవస్థానానికి అనుకూలంగా వచ్చిందనీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేవస్థానం అధికారులపై ఆక్రమణదారులు దాడులకు తెగిస్తున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించకపో వడంతో తాము ధర్నా నిర్వహించి నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి ఆలయ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఎటపాక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ మాతృశక్తి విభాగ్‌ సహ సంయోజిక విజయలక్ష్మి, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్‌ జిల్లా సహ సంయోజక్‌ పిచ్చయ్య నాయుడు, రమేష్‌, సీత, మధుసూదన చారి, లక్ష్మి, రవి కుమార్‌, తిరుపతిరావు, రాజయ్య, రాధాకృష్ణ, రమేష్‌, జల్లి వెంకట్‌, రామారావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T04:44:40+05:30 IST