Advertisement

రాజకీయ రణరంగంగా రామగుండం కౌన్సిల్‌

Jan 24 2021 @ 00:19AM
నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

- చిచ్చురేపిన ఎస్సీ సబ్‌ప్లాన్‌ కేటాయింపులు  

- మేయర్‌ పోడియం వద్ద ప్లకార్డులతో కాంగ్రెస్‌, బీజేపీ నిరసన  

- కమిషనర్‌ చాంబర్‌లో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల బైఠాయింపు

కోల్‌సిటీ, జనవరి 23: రామగుండం నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రాజకీయ రణరంగంగా మారింది. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల కేటాయింపు కౌన్సిల్‌లో చిచ్చు పెట్టింది. ఎన్నికలైన ఏడాది తరువాత జరిగిన మొదటి సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలు, గొడవలు, తో పులాటలతో దద్దరిల్లింది. పోలీసుల భద్రత మధ్య సాధారణ సమావే శం గొడవలతో ముగిసింది. ప్రజా సమస్యలపై ప్రస్తావన లేకుండానే, ఎ జెండాపై చర్చ లేకుండానే ఏకపక్షంగా ఆమోదించినట్టు ప్రకటించారు. ఐఏఎస్‌ అధికారి అయిన కమిషనర్‌ది ప్రేక్షక పాత్రే అయ్యింది. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌ కనుసన్నల్లోనే కౌన్సిల్‌ మేయర్‌ అనీల్‌ కుమార్‌ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మమహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కొలిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, ముస్తఫా, ముదాం శ్రీనివాస్‌, గాదం విజ య, నగునూరి సుమలత, దాసరి సావిత్రి, సనా ఫకృద్దీన్‌, బీజేపీ కార్పొరేటర్లు కౌశిక లత, దుబాసి లలిత, కల్వల శిరీష ప్లకార్డులతో మేయర్‌ పోడియం వద్ద నిరసనకు దిగారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపు లో వివక్ష ప్రదర్శించారని, ఎస్సీ అధిక జనాభా ఉన్న డివిజన్లకు సమానంగా నిధులు కేటాయించాలని నిరసనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు ఆధ్వర్యంలో విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరుపక్షాలు నినాదాలు చేశారు. అరుపులు, కేకలు పెట్టారు. దీంతో పలు మా ర్లు మేయర్‌ కార్పొరేటర్లు తమ స్థానాలకు వెళ్లాలని సూచించారు. గోదా వరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్స రమేష్‌, రాజ్‌కుమార్‌, టుటౌన్‌ సీఐ శ్రీని వాస్‌, పలువురు ఎస్‌ఐలు, సిబ్బందికి కౌన్సిల్‌ సమావేశ మందిరంలోకి వచ్చారు. మఫ్టీలో ఉన్న ఐడీ పార్టీ పోలీసులు మేయర్‌ పోడియం వెను క రక్షణగా ఉన్నారు. ఈ గొడవల మధ్య కార్పొరేషన్‌ పీఆర్‌ఓ కుమార్‌ ఎజెండా చదవడం మొదలు పెట్టారు. దీంతో బీజేపీ కార్పొరేటర్‌ కౌశిక లత, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ బొంతల రాజేష్‌ ఎజెండాలను లాక్కున్నారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఎజెండా ప్రతులను చించివేశారు. దీంతో టీఆర్‌ ఎస్‌ కార్పొరేటర్లు దళిత మేయర్‌ అవమానపరుస్తున్నారంటూ గొడవ కు దిగారు. పోలీసులు ఇరువర్గాల కార్పొరేటర్లను పోడియం వద్ద నుం చి తోసివేశారు. కౌన్సిల్‌ సమావేశ మందిరానికి పోలీసులు ఎందుకు వ చ్చారని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉందని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులను పిలిపించడం పై కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ను నిలదీశారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియం చుట్టూ రక్షణగా నిలిచారు. ఎజెండాలోని కొన్ని అం శాలు చదువుతుండగా టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, మరికొందరు తమ స్థా నాల వద్దకు వెళ్లి బల్లలలు చరిచి ఆమోదం తెలిపారు. ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా ఎజెండా ఆమోదమైనట్టు మేయర్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మాత్రం అక్కడే నిరసనకు దిగారు. అర్ధరాత్రి వరకు బైఠాయించారు. రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే సుమారు రూ.32కోట్ల పనులు, ఇతర అంశాలకు ఆ మోద ముద్ర వేశారు. ఈ సమావేశంలో కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్‌, కన్నూరి సతీష్‌, దాతు శ్రీనివాస్‌, ఇంజపురి పులేందర్‌, బాల రాజ్‌కుమార్‌, అడ్డాల గట్టయ్య, సాగంటి శంకర్‌, కుమ్మరి శ్రీనివాస్‌, మంచికట్ల దయాకర్‌, శంకర్‌నాయక్‌, కోఆప్షన్‌ సభ్యులు వంగ శ్రీ నివాస్‌, బుచ్చిరెడ్డి, కృష్ణవేణి, ధరణి స్వరూప, రాకం లత, కవితసరోజి ని, కాల్వ స్వరూప, జంగపల్లి సరోజన, పాతిపెల్లి లక్ష్మి, కోఆప్షన్‌సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, రఫిక్‌, తస్నిమ్‌ భాను పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement