శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే చందర్
- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కోల్‌సిటీ, మార్చి 27: రామగుండం మున్సిపల్ కార్పొరేష న్, రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి ఒక చక్కటి ఉదాహరణ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేషన్ 48వ డివిజన్లో రూ.50లక్షలతో చేపట్టనున్న అభి వృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.200కోట్ల సీఎంఏ గ్రాంట్లు, 14, 15 ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, డీఎంఎఫ్టీ నిధులతో ఏ గల్లీలో చూసినా, వాడలో చూసినా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయన్నారు. పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతులే ధ్యేయంగా, పట్టణ సుందరీకరణ కోసం అనేక కార్యక్ర మాలు చేపడుతున్నామన్నారు. రూ.29కోట్లతో రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పారిశు ధ్య సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పొన్నం విద్య, బాల రాజ్‌కుమార్, కో ఆప్షన్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, రఫిక్, టీఆర్ఎస్ నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, పొన్నం లక్ష్మణ్‌గౌడ్, జలపతి, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్యం, రాంమూర్తి, నాగభూషణం పాల్గొన్నారు.