ప్రాచీన కళలకు జీవం పోస్తున్న రామయ్య

ABN , First Publish Date - 2022-08-15T05:14:27+05:30 IST

కనుమరుగవుతున్న ప్రాచీన కళలకు జీవం పోస్తూ ఉత్సవాల సమయంలో ప్రాచీన కళల రూపాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఆ కళల ప్రాధాన్యత తెలిపి అందరి మనన్నలు పొందాడు.

ప్రాచీన కళలకు జీవం పోస్తున్న రామయ్య
పెద్ద పులి వేషంలో మార్తల రామయ్య, ఇన్‌సర్ట్‌లో రామయ్య (ఫైల్‌ఫొటో)

పోరుమామిళ్ల, ఆగస్టు 14: కనుమరుగవుతున్న ప్రాచీన కళలకు జీవం పోస్తూ ఉత్సవాల సమయంలో ప్రాచీన కళల రూపాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఆ కళల ప్రాధాన్యత తెలిపి అందరి మనన్నలు పొందాడు. పోరుమామిళ్లలోని రంపాడు వీధి వాసి మార్తల రామయ్య. 74 ఏళ్ల వయసులో కూడా కళల పట్ల ఉన్న ఆసక్తిని ఇప్పటికీ మరువలేదు. ముఖ్యంగా పోరుమామిళ్లలో జరిగే మొహర్రం వేడుకల్లో భాగమైన పీర్ల నిమజ్జనం సం దర్భంగా అనాదిగా పెద్దపులుల వేషధారణలకు ప్రత్యేకత ఉంది. గతంలో పీర్ల పండుగ పోరుమామిళ్లలో జరిగిందంటే దాదాపు 20 మంది కళాకారులు పులివేషధారణ వేసి ఎడ్లబండ్లపై, ట్రాక్టర్లపై వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం ఆనవాయుతీ ఈ వేషం వేయడం కూ డా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఆ వేషంపై మక్కువ వదులుకోలేని రామయ్య తన 74 ఏళ్ల వయస్సులో కూడా పెద్ద పులి అడుగులు వేస్తూ అందరి మన న్ననలు పొందారు. యుక్త వయసులో గోదాలో కుస్తీ పోటీలు కూడా నిర్వహించేవాడు.

Updated Date - 2022-08-15T05:14:27+05:30 IST