కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-05-01T15:37:57+05:30 IST

మేడే సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు.

కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు: రామకృష్ణ

విజయవాడ: మేడే సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయని, అధిక ధరలు, పన్నుల భారాలను ప్రజల నెత్తిన మోపుతున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని రామకృష్ణ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-05-01T15:37:57+05:30 IST